భక్తి ప్రపత్తులతో నృత్య జాగరణ
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులు స్వయంగా అభి షేకాలు చేశారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 9 మంది వేదపండితుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి, రుద్ర, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి శివరాత్రిని పురస్కరించుకుని శ్రీసాయి మంజీర కూచిపూడి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో శివపాద మంజీర నాదం పేరున నృత్య జాగరణ జరిగింది. గురువు కాజ వెంకట సుబ్రహ్మణ్యం శిష్యబృందం పలువురు ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పలు నృత్యాంశాలను ప్రదర్శించారు. వెంకటగిరి నాగలక్ష్మి, తాళ్లూరి ధరణి, పచ్చల నాగమహిత తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.


.jpeg)
.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి