ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వైభవంగా శ్రీవారి కళ్యాణం - 19.07.2026

వైభవంగా శ్రీవారి కళ్యాణం   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. మూలవిరాట్‌కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. వేదపండితుల ఆధ్వర్యంలో దంపతులచే ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు - 14.12.2025

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు

దేహమే దేవాలయం అన్న భావనతో జీవితాన్ని కొనసాగించడమే రాజనీతికి అంతిమ ప్రస్థానమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న గరిక పాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిసాయి. చివరి రోజున ఆముక్తమాల్యద రాజనీతి అంశంపై డాక్టర్ గరికపాటి ప్రవచిస్తూ.. రాజైనవాడు తన పాలనలో ఆశ్రిత పక్షపాతాలకు తావివ్వకుండా ఆత్మసిద్ధితో నిర్ణయాలు తీసుకోవడంలో రాజు రాజర్షిగా వ్యవహరించాలని అన్నారు. విమర్శలను తట్టుకొని సమస్యలకు పరిష్కారం కోసం ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలని ఆముక్తమాల్యద ద్వారా రాజనీతిజ్ఞత శ్రీకృష్ణదేవరాయలు ఆచరణలో చూపాడన్నారు. అవిశ్వాస తీర్మానం కుట్రతో టంగుటూరి ప్రకాశం, ఒక్క ఓటు తేడాతో మాజీ ప్రధాని వాజ్పేయి రాజీనామాలు చేసి రాజనీతిజ్ఞ తను చాటుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు మస్తానయ్య, సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు శ్రీలక్ష్మి దంపతులు, చైత్రన్, చిట్టినేని శివ కోటేశ్వరరావు, పారా అశోక్ కుమార్, గూడవల్లి లక్ష్మీనారాయణ పాల్గొని గరికపాటిని ఘనంగా సత్కరించారు.












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.