అలరించిన సత్యహరిశ్చంద్ర నాటకం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం సాయంత్రం సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. బంగారు డి.వి.ఆచంట, ఆచంట కళా సమితి (వేటపాలెం), కళావిపంచి, యువ కళావాహని (హైదరాబాద్) ఆధ్వర్యంలో దివంగత వై.కె.నాగేశ్వరరావు పంచమ వర్ధంతి సందర్భంగా నాటిక ప్రదర్శితమైంది. ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కళావిపంచి గౌరవాధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, డోగిపర్తి శంకరరావు, రామమోహనరావు (వి జయ వాడ) జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. కళారత్న తుర్లపల్లి రాధాకృష్ణమూర్తి దర్శకత్వం వహించగా, డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ రచించారు. హరిశ్చం ద్రగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్, చంద్రమతిగా డాక్టర్ జి.రత్నశ్రీ, విశ్వామిత్రుడిగా కళారత్న కావూరి సత్యనారాయణ, ఇతర పాత్రల్లో పౌరాణిక పద్యాలను గానం చేస్తూ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో కళావిపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు, భాగి శివశంకర్ శాస్త్రి, జి.మల్లికార్జునరావు, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి