నిస్వార్థ సేవలకు నిలువుటద్దం డాక్టర్ కాసరనేని
డాక్టర్ కాసరనేని సదాశివరావు కుటుంబానికి, తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్లో అన్నమయ్య కళావేదికపై డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా సమితి ఆత్మీయ పురస్కార వేడుక, ముగింపు నాటకోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత సంస్థ చైరన్ యర్రా నాగేశ్వరరావు, డాక్టర్ రమాబాల, డాక్టర్ ఉషాబాల, డాక్టర్ పాతూరి కిరణ్ చౌదరి, డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్, రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు, అప్పసాని రాజేష్, మందలపు బంగారుబాబు, రంగస్థల నటులు గెద్ద వరప్రసాద్, కన్వీనర్ కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాదు తదితరులతో కలిసి మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజికి డాక్టర్ కాసరనేని సదాశివరావు ఆత్మీయ పురస్కారాన్ని ఆమె అందజేశారు. అనంతరం మల్లాది క్రియేషన్స్ మల్లాది రవికిరణ్ రచన, మల్లాది భాస్కర్ దర్శకత్వం వహించిన ఆవేశంలో ఆనందం హాస్యనాటిక ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఆదూరి పాపారావు, నల్లా శేషు తదితరులు పర్యవేక్షించారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి