అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
వైభవంగా గోదారంగనాథుల కల్యాణోత్సవం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గోదారంగనాథుల కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు. బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో తితిదే ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ సహకారంతో ఆలయ పాలకమండలి పర్యవేక్షణలో తిరుప్పావై ముగింపు గోదారంగనాథుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగ నాయకి తిరుప్పావై ప్రవచనాలు చేశారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి