ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు - 14.12.2025

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు దేహమే దేవాలయం అన్న భావనతో జీవితాన్ని కొనసాగించడమే రాజనీతికి అంతిమ ప్రస్థానమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న గరిక పాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిసాయి. చివరి రోజున ఆముక్తమాల్యద రాజనీతి అంశంపై డాక్టర్ గరికపాటి ప్రవచిస్తూ.. రాజైనవాడు తన పాలనలో ఆశ్రిత పక్షపాతాలకు తావివ్వకుండా ఆత్మసిద్ధితో నిర్ణయాలు తీసుకోవడంలో రాజు రాజర్షిగా వ్యవహరించాలని అన్నారు. విమర్శలను తట్టుకొని సమస్యలకు పరిష్కారం కోసం ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలని ఆముక్తమాల్యద ద్వారా రాజనీతిజ్ఞత శ్రీకృష్ణదేవరాయలు ఆచరణలో చూపాడన్నారు. అవిశ్వాస తీర్మానం కుట్రతో టంగుటూరి ప్రకాశం, ఒక్క ఓటు తేడాతో మాజీ ప్రధాని వాజ్పేయి రాజీనామాలు చేసి రాజనీతిజ్ఞ తను చాటుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు మస్తానయ్య, సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు శ్రీలక్ష్మి దంపతులు, చైత్రన్, చిట్టినేని శివ కోటేశ్వరరావు, పారా అశోక్ క...

రాజనీతిలో రాముడే ఆదర్శం - గరికపాటి నరసింహారావు - గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ - 13.12.2025

 రాజనీతిలో రాముడే ఆదర్శం

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు

 భరతుడికి శ్రీరాముడు చేసిన ధర్మోపదేశం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. గుంటూరు, బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం, అన్నమయ్య కళావేదికపై గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే గరికపాటి ప్రవచనాల కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీవేంకటేశ్వర దేవస్థానం వెబ్సైట్, యూప్ను దేవస్థానం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, గుళ్ళపల్లి సుబ్బారావు, గుళ్ళపల్లి రాఘవేంద్ర రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రామాయణంలో రాజనీతిపై గరికపా టి ప్రవచించారు. రాజు అనేవాడు ఇంద్రియాలకు లొంగిపోకూడదు. పొగడ్తలకు పొంగిపోరాదు. అపరాధులను నేరం రుజువైన తరువాతే శిక్షించాలి. యువతలో దైవనామస్మరణ, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించగల్గితే తద్వారా ధర్మ, చింతన పరోపకారకాలు సిద్ధి స్తాయని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిస్తే నాటి రాముడి రాజ్యం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని నగరంలో దేవాలయాల నిర్మాణం జరగడం శుభ సూచికమని, తద్వారా ప్రజలలో ఆధ్యాత్మి భావాలు, దైవచింతన పెరుగుతాయని రుగుతాయని అన్నారు. తొలుత వందేమాతరం 150సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభికులచే వందేమాతరం నినాదాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో ఏ సృజనకుమార్ దంపతులు, స్నేహ, చిట్టినేని శివ కోటేశ్వరరావు, బొల్లేపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.