ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తండ్రి విశిష్టతను చాటిన నాన్న నాటిక - 15.06.2026

తండ్రి విశిష్టతను చాటిన నాన్న నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర నాటక అకాడమి సౌజన్యంతో శ్రీ సద్గురు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాల రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాన్న నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత శ్రీ సత్యసాయి బడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ కొల్లా ధనలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బసవరాజు సిస్టర్స్ శ్రేష్ట, నైనికలు ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. భరణి కూచిపూడి నృత్య కళాశాల నిర్వాహకులు నాట్యాచార్య పూల భరణి శిష్య బృందం, నాట్య చారిణి అనిత శ్రీ సత్యసాయి బడిల్ స్కూల్ విద్యార్థులు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు డాక్టర్ ఎన్. రవికుమార్, శ్రీ సత్య సాయి బడియల్ స్కూల్ కరస్పాండెంట్ కొల్లా శంకర్ కిషోర్ కుమార్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబ...

సద్గురు కళా నిలయం నాటకోత్సవాలు ప్రారంభం - 13.05.2026

సద్గురు కళా నిలయం నాటకోత్సవాలు ప్రారంభం

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేది కపై శ్రీ సద్గురు కళా నిలయం నాటకోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో ఈ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. విజమ్ స్కూల్ ప్రిన్సిపాల్ సగుటూరి శారద జ్యోతి ప్రజ్వలన చేయగా, సంగీత విద్వాంసురాలు బి.శ్రీలక్ష్మి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం శిష్య బృందం పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ప్రముఖ రచయిత నాటక విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్యలు ప్రముఖ రంగస్థల నటి ముత్యాల లక్ష్మీతులసిని ఘనంగా సత్కరించారు. ఆకెళ్ళ సూర్యనారాయణ రచనకు బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించిన సహప్రయాణం నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.