సేవకు ప్రతిరూపం మాదల శకుంతల
సేవకు ప్రతిర ప్రతిరూపం దివంగత మాదల శకుంతల అని పలువురు కీర్తించారు. బుధవారం మాదల శకుంతల ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక బృందావనగార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద కార్యక్రమాలు జరిగాయి. తొలుత పురాణ దర్శనం గ్రంథావిష్కరణ సభ జరిగింది. సభకు డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ పండితులు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. గ్రంథ ప్రచురణ దాత, గ్రంథ స్వీకర్త ధార్మికరత్న మాదల రత్నగిరి బాబు, గ్రంథ రచయిత డాక్టర్ జయంతి చక్రవర్తి తదితరులు మాదల శకుంతల జీవిత విశేషాలను, ఆదర్శ గుణగణాలను వివరించారు. ఈ సందర్భంగా 500 మంది వృద్ధులకు, అనాథలకు అన్నదానం, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పాటిబండ్ల శివాజీ, డాక్టర్ పూజ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి