డాక్టర్ సదాశివరావు కళా సమితి నాటకోత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావే దికపై రెండు రోజులపాటు నిర్వహించనున్న డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి నాటకోత్స వాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కె.ఆర్.కె.ఈవెంట్స్ నిర్వహణలో జరగ్గా, అతిధులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను సంస్థ చైర్మన్ సీనియర్ వైద్యులు యర్రా నాగేశ్వరరావు, సభ్యులు యర్రా ఈశ్వరరావు, పోలిమెట్ల గోపీచంద్, కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు, ప్రజానాట్య మండలి కళాకారుడు నూతలపాటి కాళి దాసు పంపిణీ చేశారు. ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత/ దర్శకుడు కావూరి సత్యనారాయణతో శకుని శపధం ఏకపాత్ర ప్రదర్శన అలరించింది. అనంతరం మానవతా (యడ్లపాడు) ఆధ్వర్యంలో జరుగుల రామారావు రచన, దర్శకత్వం వహించిన అంతా మంచివారే కానీ అనే నాటకం ప్రదర్శించారు. రాజేశ్వరి, ఎస్.పూజిత, పద్మారావు, ఎన్. సూర్య, జరుగుల రామారావులు నటించగా, ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమాన్ని ఆదూరి పాపా రావు, నల్లా శేషు పర్యవేక్షించారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి