అలరించిన హాస్యవల్లరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గుంటూరు హ్యూమర్ క్లబ్ 13వ వార్షి కోత్సవం, 120వ హాస్యవల్లరి ఆదివారం నిర్వహించారు. తొలుత అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రొఫెసర్ జంపని కిషోర్ బాబు సభకు అధ్యక్షత వహించారు. వ్యవస్థాపక కార్య దర్శి హాజీ షేక్ లాల్ వజీర్, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యులు దామచర్ల శ్రీనివాస రావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వర రావు, ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ విశాఖపట్టణం వ్యవస్థాపకులు ఎంవీ సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. అనం తరం ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ (విశాఖపట్నం) ప్రదర్శించిన హాస్యవల్లరి అలరించింది. ఈ హాస్యవల్లరిలో ఎంవీ సుబ్రహ్మణ్యం, జబర్దస్త్ ప్రకాష్, రాగన్ నాయుడు, బోను నరసింహారావు, నక్షత్ర, పుష్యమి నటించగా ప్రేక్షకులను తమ పాత్రలలో అలరించాయి.

.jpeg)


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి