నగరంలో హనుమత్ జయంతి వేడుకలు
నగరంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయాల్లో వేకువజాము నుంచే స్వామి మూలవిరాట్కు అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయాలు కిక్కిరిసాయి. భక్తులకు అన్నప్రసాద వితరణ, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉత్సవాల్లో పాల్గొని, స్వామి వారికి దర్శించుకున్నారు. బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొలేపల్లి సత్యనారాయణ దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య తదితరులు ఉత్సవాలను ప్రారంభించారు. స్వామికి విశేష అభిషేకాలు, నాగవల్లి దళార్చన, అలంకరణతో పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం స్వామి వారి శోభాయాత్ర నిర్వహించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి