విజయభాస్కరరావుకి సాంబయ్య స్మారక అవార్డు ప్రదానం
స్థానిక బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శ్రీపద్మావతి కల్యాణ వేదికపై గురువారం ఆత్మీయ ఆర్ట్స్ థియేటర్, సీహెచ్.సాంబయ్య స్మారక పరిషత్ ఆధ్వర్యంలో విద్యా ప్రదాత సీహెచ్.సాంబయ్య 37వ వర్ధంతి సభ నిర్వహించారు. సభకు ఆత్మీయ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులు సీహెచ్. భాస్కరరావు అధ్యక్షత వహించారు. అనంతరం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కరరావుకు సీహెచ్.సాంబయ్య స్మారక అవార్డుతో సత్కరించారు. విజయవాడ సౌత్ కోస్ట్ రైల్వేస్ సీనియర్ డివిజినల్ భద్రతాధికారి వావిలపల్లి రాంబాబు, మలినేని విద్యాసంస్థలు చైర్మన్ మలినేని పెరుమాళ్లు, నందివెలుగు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తోట లక్ష్మీకోటేశ్వర రావు, తెలుగు/ ప్రాచ్యభాషా విభాగం శాఖాధిపతి ఆచార్య నారిశెట్టి వెంకటకృష్ణరావు ప్రసంగించారు. విజయభాస్కరరావు విద్యా రం గంలో అందించిన సేవలు మరువలేమని వక్తలు అన్నారు. వ్యాఖ్యతగా వంగిపురపు శారద వ్యవ హరించగా, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొనగా, తొలుత ఆత్మీయ ఆర్ట్స్ థియేటర్ గుంటూరు 17వ వార్షికో త్సవంలో భాగంగా నాట్యమయూరి లేఖ్యా భరణి బృందం (విజయవాడ) నృత్య ప్రదర్శన చేపట్టారు. అనంతరం కొండలస్వామికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి ఆత్మీయంగా సత్కరించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి