అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి ప్రదర్శితమైన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఏలూరు శ్రీపాద శ్రీవల్లభ కూచిపూడి నాట్య నిలయం విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనలి. చ్చారు. మేదరమెట్ల శిరీష శిష్య బృందం వినాయక కల్పం, బ్రహ్మాంజలి, రామాయణ శబ్దం. నారాయణీయం, దేవదేవం, భామాకలాపం, దశావతారాలు తదితర కీర్తనలకు కూచిపూడి నృత్యాలను అభినయించారు. అనంతరం దేవాలయ పాలకమండలి సభ్యులు మేద రమెట్ల శిరీష శిష్య బృందాన్ని సత్కరించారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి