హనుమద్ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వర్వస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం పీఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్, గిరిబాల దంపతుల జ్ఞాపకార్థం హనుమద్ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారా యణమూర్తి హనుమత్ వైభవ సప్తాహం ముగింపుగా ప్రవచనాన్ని ప్రారంభించారు. ఆత్మస్వరూపుడైన రాముడికి తన శరీరాన్ని సారధి చేసినవాడు ఆంజనేయుడని తెలిపారు. యుద్ధంలో ఆంజనేయుని వీరవిహారం అసా ధారణం అంటూ రాక్షస ఘనాలలో ప్రథమ వీరులను హతమార్చిన చిరంజీవుడు ఆంజనే యుడని పేర్కొన్నారు. లక్ష్మణుడు మూర్చల్లి నప్పుడు హిమవత్ పర్వతం నుంచి సంజీవని త్రుటిలో తీసుకొచ్చిన ఘనుడని కొనియా డారు. ఆంజనేయస్వామి విష్ణుమూర్తి చేతి నుంచి వెలువడిన చక్రం వలె వెళ్లి సంజీవనిని సాధించారన్నారు. అనంతరం మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిని పాలకమండలి నిర్వాహకులు సత్కరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి