వైభవంగా శ్రీవారి కళ్యాణం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. మూలవిరాట్‌కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. వేదపండితుల ఆధ్వర్యంలో దంపతులచే ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
క్షీరసాగర మధనంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం క్షీర సాగర మధనంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రయత్నం ప్రారంభించినప్పుడు మొదట ఆటంకాలు, కష్టాలు వస్తాయన్నారు. వాటిని చూసి భయపడి పారిపోకుండా ఓర్పుగా ప్రయత్నం చేసిన వారికి లక్ష్యం సిద్ధిస్తుందన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి