పోరాట పటిమ మహారాణా ప్రతాప్ సింగ్
స్థానిక బృందావన్గార్డెన్స్లో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం మహారాణా ప్రతాప్సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏపీ బొందిలి సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, రాణాప్రతాప్సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్ బాబు సభా పరిచయం చేశారు. రామరాజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామారాజు శ్రీనివాస్ సభాధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, నెల్లూరు జిల్లా బొం దిలి అసోషియేషన్ అధ్యక్షులు రాజారాం శ్రీనివాస్, బి.కృష్ణసిం గ్, కళారత్న కావూరి సత్యనారాయణ, బొందిలి సంఘం రాష్ట్ర యువజన నాయకులు కె. పవన్సింగ్, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. మహారాణా ప్రతాపసింగ్ చేసిన పోరాట పటిమలు, సంస్థ సేవలను కొనియా డారు. ప్రముఖ వీణా విద్వాంసురాలు రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ను సత్కరిం చారు. అనంతరం నాటరాజ సంగీత నృత్య కళాశాల నాట్యాచారిణి అనంతుల శిష్యబృందంచే విజయకుమారి కూచిపూడి నృత్యాంజలి ప్రదర్శించగా, సంఘం ఉపాధ్యక్షులు క్షత్రి ధర్మనారాయ ణసింగ్ పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి