ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన నృత్య ప్రదర్శన - 05.04.2026

అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.

విద్యా సుందరి నాగరత్నమ్మ పురస్కారం - 08.02.2026

విద్యా సుందరి నాగరత్నమ్మ పురస్కారం

ప్రసిద్ధ నాట్య గురువులు అన్నాబత్తుల లీలా సాయి, మంగతా యారు కళావంతుల కుటుంబంలో జన్మించిన కానీ తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో దక్షిణ భారతం సాహిత్య సేవా రంగంలో రాణించిన విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం అందు కోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ప్రసిద్ధ నాట్య గురువులు అన్నా బత్తుల లీలా సాయి మంగ తాయారులు పేర్కొన్నారు. స్వర్గీయ జే వెంకటేశ్వర రావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నమయ్య కళావేదిక పై సోదరీ మణులందరికీ శాలువా పూలమాలలు జ్ఞాపకాలు నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కథా రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేవదాసి వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన స్థానం పొందిన ఎందరో కళామతల్లులు భగవద్ ఆరాధనగా భావించే వారిని కొనియాడారు. అనంతరం పురస్కార గ్రహీతల శిష్యురాలు రిందా శరణ్య కూచిపూడి డాన్స్ అకాడమీ డాక్టర్ యశోద ఠాకూర్ బృందంచే కళావంతుల శైలి భామాకలాపం ప్రదర్శన రసజ్ఞులను ఆనందింపచేసింది.









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.