ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
స్థానిక బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర దేవస్థానం అన్నమయ్య కళావేదికపై రాధామాధవ రసరంజని 330వ నెల నెల వెన్నెల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు కీర్తనలకు చిన్నారులు, కళాకారులు కూచిపూడి, జానపద నృత్యాలను ప్రదర్శించారు. సీహెచ్ చార్విరాజు (యూఎస్ఏ) ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య ఎస్ కే ఖలీల్ పర్యవేక్షించారు.

.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి