ఆంజనేయ ప్రసాద్ సాహిత్యసేవలు ప్రశంసనీయము
ప్రముఖ సాహితీవేత్త పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సాహిత్యానికి చేసిన సేవలు అభినందనీయమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవదనకులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై. గురువారం వి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్, గిరిజాల దంపతులు సృత్యర్థం ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ శృంగేర్ విరూపాక్ష ఉత్తరపీఠాధిపతులు పరశివానంద భారతీస్వామి, సంస్కృత పండితులు డాక్టర్ డి.యన్. దీక్షితులు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, ఆలయ కమిటి అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొని ఆంజనేయ ప్రసాద్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాలను గురించి ప్రశంసించారు. అనంతరం శ్రీమన్నారాయణమూర్తి హనుమర్ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కార్యక్రమాన్ని పి. రవికిషోర్, హైమానంద్ లు పర్యవేక్షించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి