ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని డాక్టర్ చందు మీనా అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్న మయ్య కళావేదికపై శుక్రవారం జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. చందు మీనా మాట్లాడుతూ మెదడుకు రక్తప్రసరణ సక్ర మంగా అందకపోవడం వల్ల పక్షవాతం సంభవిస్తుంద న్నారు. పక్షవాతం, మతిమరుపు, తలతిరగడం వంటివి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతాలు కావచ్చని వివరించారు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మన్నె సుబ్బారావు, సభ్యులు కోగంటి బసవనందికేశ్వరరావు, బసవనందికే దశరథ్ పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి