కనులపండువగా పుష్పయాగం
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మాధవస్వామి బృందం మూల విరాట్కు అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేశారు. సాయంత్రం సిమ్రాన్కోర్, కపిలవాయి కార్తిక్ సౌజన్యంతో తులసీదళాలు, 5 క్వింటాళ్ల పుష్పాలతో అమ్మవారికి పుష్పయాగం చేశారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి