విరాటపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధ వారం సాయంత్రం మహాభారతంలోని విరాటపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారతంలో అజ్ఞాతవాసంలో పాండవులు తమ రూపాలను, పేర్లను మార్చుకుని విరాటరాజు కొలువులో పలు బాధ్యతలను స్వీకరించారని పేర్కొన్నారు. ద్రౌపది సైరంధ్రి అనే మారు పేరుతో రాణి సుధేష్ణకు పరిచారికగా ఆశ్రయం పొందారని తెలిపారు. ఇలా పాండవులు, ద్రౌపది తమ అసలు గుర్తింపును దాచి, చాకచక్యంగా విరాటరాజు కొలువులో ఉద్యోగాలు సంపాదించి అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా చేశారన్నారు.
.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి