శ్రవణానందంగా సాగిన భక్తి గీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయి సంగీత కళా నిలయ సంస్థ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 52 మంది చిన్నారుల అన్నమయ్య కీర్తనలను గానం చేసి ప్రేక్షకులను శ్రవణానందం చేశారు. అనంతరం సీనియర్స్, కీబోర్డ్ కళాకారులు భక్తిగీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వివా ది స్కూల్ డైరెక్టర్ కోయ శ్రీనివాసరావు, హెల్త్ ఆస్పత్రి డాక్టర్ దుంప రవీంద్రరెడ్డి, టూబాకో బోర్డ్ మెంబర్, కొప్పరావూరి అగ్రో ప్రొడక్ట్ ఫౌండర్ కె. రమేష్ పాల్గొని చిన్నా రులను ఆశీర్వదించారు. ఏ.ఐ.ఆర్. బి హైగ్రేడ్, టీటీడీ ఆర్టిస్ట్ బి భువనేశ్వరికి సంగీత సుధామయి బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నృత్య కళాభారతి అధ్యక్షుడు నాట్యాచార్యులు ఎన్. బాలు వ్యవహరించగా, వ్యవస్థాపక అధ్యక్షుడు తిన్నలూరి హరిబాబు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి