అలరించిన నృత్యాభినయం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం సాయంత్రం శిఖర కళారామం కూచిపూడి నృత్య కళాశాల ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. నాట్యాచారిణి ఎం.గీతాంజలి శిష్య బృందంతో నాట్యార్చనలో భాగంగా శక్తి సహిత గణపతి, అర్థనారీశ్వర స్తుతి, ముద్దుగారే యశోద, మాహేశ్వరీ మహాకాళీ, శివాష్టకం కీర్తనలకు విద్యా ర్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వర రావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, ఎం. అనిరుథ్ పాల్గొన్నారు.

.jpeg)
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి