ఘనంగా అన్నమయ్య జయంతి
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి మహోత్సవం వైభవంగా జరిగింది. 200 మంది స్థానిక కళాకారులు సప్తగిరి సంకీర్తనల మహా గోష్ఠిగానం చేశారు. కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల విద్యార్థులు నాదస్వర కచేరీ చేశారు. పులికొండ పిచ్చయ్య, శ్రీవల్లి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామాచారి కొమండూరికి సంస్థ అధ్యక్షు రాలు డాక్టర్ పి. విజయ, డాక్టర్ టి. చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు మస్తానయ్య తదితరులు సన్మానించారు. డాక్టర్ రామాచారి కొమండూరి బృందం అన్నమయ్య సంకీర్తన గానం చేశారు. సంస్థ ప్రధానకార్యదర్శి ఎం.వై. శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్. రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, మాధవపెద్ది మీనాక్షి, కార్యదర్శి ఏ.వీ. మంగాదేవి, కోశాధికారి డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు అతిథులు, కళాకారులను సత్కరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి