హార్మోనిస్టు గోపరాజు శేషుకు కళావాహిని పురస్కారం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం ప్రముఖ రంగస్థల నటుడు, సంగీత విద్వాంసుడు. పొతకమూరి కాళహస్తీశ్వరరావు 17వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు కాళహస్తి కళావాహిని అధ్యక్షుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించగా, నడింపల్లి హనుమంతరావు, డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపరాజు శేషును కళావాహిని పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాలమూరు కళావిపంచి బృందం 'మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం' పౌరాణిక పద్యనాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి