ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం - 07.02.2026

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...

డిజిటల్ మోసాలపై అవగాహన అవసరం - 02.02.2026

డిజిటల్ మోసాలపై అవగాహన అవసరం

బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మహిళా విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ మోసాలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో సైబర్ మోసాల బారిన పడకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్ప్ ఏజ్ ఇండియా స్వచ్చంద సంస్థ తరఫున రాష్ట్ర సమన్వయకర్తగా పులి శ్యామ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్, సైబర్ మోసాలు జరిగే తీరుతెన్నులు, వాటి నుంచి రక్షించుకొనే మార్గాలను వివరించారు. ప్రధానంగా మహిళలు, వయోవృద్ధులు ఎలా మోసపోతున్నారో వివరించి.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాహితీవేత్త ఆచార్య వెలువోలు నాగరాజలక్ష్మి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి అధ్యక్షత వహించారు. అనంతరం పులి శ్యామ్ను మహిళా విభాగం, ఆలయ పాలక మండలి సభ్యులు సత్కరించారు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.