అవయవదానంపై అవగాహన అవసరం
అవయవదానంపై అందరికీ అవగాహన అవసరమని డాక్టర్ పంచుమర్తి కల్పన తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సభ జరిగింది. సభలో ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి చేసే అవయవదానం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వర రావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ టి. రాధాబాయి అధ్యక్షత వహించి మాట్లాడుతూ స్త్రీల శక్తియుక్తులను తెలిపే రాణి దుర్గావతి ధైర్యసాహసాల గురించి వివరించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన వైష్ణవీ దేవి గురించి ప్రసంగిం చారు. కార్యక్రమంలో డాక్టర్ పంచుమర్తి కల్పనను నిర్వాహకులు సత్కరించారు.
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి