అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.
భక్తిశ్రద్దలతో చండీ హోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 11 మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి