భక్తి, చరిత్ర, భాష సాహిత్యాల సంగమం
భక్తి, దేశభక్తి, చరిత్ర, భాష సాహిత్యాల సంగమ స్వరూపమైనది ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అష్టాదశ శక్తి పీఠాలు పై కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నగరాజలక్ష్మి మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గద్దె రామతులశమ్మ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా మహిళా విభాగం పలు రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి మహిళలకు చైతన్య స్ఫూర్తి నందించిన తరిడి వెన్నమ్మ జీవిత విశేషాలను గురించి ప్రసంగించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి వైష్ణవీదేవి శక్తి పీఠ విశేషాలను తెలియజేశారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి