చూడముచ్చటగా నృత్య రూపకం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదాకల్యాణం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. తొలుత గుళ్లపల్లి సుబ్బారావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, వెంకటరామశర్మ దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారం భించారు. విజయవాడ శ్రీనృత్య ఆర్ట్ అకాడమీ నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ శిష్యబృందం గోదారంగనాథుల కల్యాణంలోని ప్రధానాంశాల ఇతివృత్తంతో నృత్య రూపకం ప్రదర్శించారు. అనంతరం భాగవతుల వెంకటరామశర్మ దంపతులను, శిష్య బృందాన్ని నిర్వాహకులు సత్కరించారు. సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవ వేంద్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి