ఆకట్టుకున్న 'విడాకులు కావాలి' హాస్యనాటిక
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని పద్మావతి కల్యాణ వేదికపై గుంటూరు గాంధీ వట్టికూటి వెంకటసుబ్బయ్య జయంతి వేడు కలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివారెడ్డి అధ్యక్షత వహించారు. అతిథులుగా పెద్ది సాంబశివరావు, పీఎస్ మూర్తి, విద్యావేత్త నూతలపాటి తిరుప తయ్య, ఆలయ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని వట్టికూటి వెంకట సుబ్బ య్య చేసిన సామాజిక సేవలను కొనియాడారు. సభానంతరం అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆధ్వర్యంలో వల్లూరు శివప్రసాద్ రచనకు గంగోత్రి సాయి దర్శకత్వం వహించిన విడాకులు కావాలి.. ఇచ్చట విడాకులు ఇవ్వబడవు హాస్యనాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నన్నపనేని శేషగిరిరావు, సామ్రాజ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో జరిగిన కార్యక్రమాలను దాసరి హనుమంతరావు, వల్లూరు తాండవ కృష్ణ పర్యవేక్షించారు.
.jpeg)
.jpeg)





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి