అలరించిన హరికథ గానం
స్థానిక బృందా వన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం ఈశ్వర వరప్రసాద పరిషత్తు నిర్వహణలో విజ యనగరానికి చెందిన హరికథా చూడామణి కాళ్ళ నిర్మల భాగవతారిణిచే శ్రీవల్లీ కల్యాణం హరికథాగానం అలరించింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, పరిషత్తు కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పసుపులేటి శ్రీధర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుకుట్ల పున్నయ్యశాస్త్రి హరికథగా రచించిన స్కాంద పురాణాంతర్గతమైన వల్లీ, కుమారస్వామి కల్యాణ గాథలో నారదుని చమత్కారంతో లక్ష్మి అతిశయం ప్రకటించటం, తనకున్న సంపద ముల్లోకాలలో ఎవరికీ లేదని గర్వించటం, వల్లీదేవితో కుమా రస్వామి వివాహం భక్తజనామోదంగా జరగడం వంటి ఘట్టాలను భాగవతారిణి వీనులవిందుగా గానం చేశారు. మృదంగంపై భానుహర్ష, వయోలిన్పై మహేశ్వరరావు చక్కటి వాయిద్య సహకారం అందించారు. కళాకారులను గరిమెళ్ళ సత్యనారాయణమూర్తి, మోదుగుల రవికృష్ణ ఘనంగా సత్కరించారు.








కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి