మల్లికార్జునరావుకు రంగస్థల పురస్కారం ప్రదానం
స్థానిక బృందావన్గార్డెనన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ, శ్రీసర్వేశ్వర నాట్యమండలి నిర్వహిస్తోన్న పద్య నాటకోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. తొలుత జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించగా, సభకు సంస్థ అధ్యక్షుడు టి.రాజాబాబు అధ్యక్షత వహించారు. అనం తరం జి.మల్లికార్జునరావును రంగస్థల పురస్కారంతో సత్కరించారు. సభానంతరం సత్యహరిశ్చంద్ర పద్య నాటకం ప్రదర్శించారు. హరిశ్చంద్రుడుగా చిట్యాల సతీష్పాల్, చంద్రమతిగా బి.అమృతవర్షిని రాగయుక్తంగా పద్యాలను అలపించారు. ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి