భావితరాలకు స్ఫూర్తి సీతారామాచార్యులు
ప్రతిభా పాటవాలతో భావితరాలకు నుండి స్ఫూర్తిని అందించిన సారస్వత మూర్తి శ్రీమాన్ కోగంటి సీతారామచార్యులు అని సాహిత్య శిరోమణి పండితరత్న ఎంటీ ఆల్వార్ కొనియాడారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళా వేదికపై నిర్వహిస్తోన్న పండిత ప్రకర్ష కోగంటి సీతారామచార్యుల శత జయంతి ఉత్సవాలు గురువారం రెండో రోజుకి చేరాయి. దేవస్థానం సంయుక్త కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా, సభకు చతుష్పావధాని కాశీ కవి అధ్యక్షత వహించారు. దత్త వైభవాన్ని మనోహరంగా, సుబోధకంగా కోగంటి వెం కటాచార్యులు వివరించారు. అక్కిరాజు సుందరరావు మాట్లాడుతూ తమ లాంటి వందలాది మందికి సీతారామాచార్యుల సన్నిహిత సాంగత్యం లభిం చడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. కార్యక్రమంలో కేవీఎల్ఎన్ అప్ప లాచార్యులు, డాక్టర్ కేవీ రంగనాయకి పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి