ఘనంగా సీతారామాచార్యుల శతజయంతి
స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై పౌరాణిక శిరోమణి, బహు గ్రంథకర్త సారస్వతమూర్తి కోగంటి సీతారామచార్యుల శతజయంతి వారోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య దీప ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త డీఎన్ దీక్షిత్ మాట్లాడుతూ సంస్కృతంతో పాటు తెలుగు సాహితీ ప్రియుల్ని ఆయన రచనలు అలరింప చేస్తాయని చెప్పారు. సభకు కోగంటి వీరరాఘవచార్యులు అధ్యక్షత వహించారు. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి హనుమద్ వైభవంపై మాట్లాడారు. కార్యక్రమంలో తిరుప్పావై డాక్టర్ కోగంటి శ్రీరంగ నాయకి, భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, నూతలపాటి తిరుపతయ్య, కోగంటి అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి