వైభవంగా భగవద్గీత పారాయణం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గీతా జయంతి సందర్భంగా సోమవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో సత్సంగ సభ్యులచే భగవద్గీత పారాయణం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. కోగంటి వేంకటే శ్రీరంగనాయకి ప్రవచిస్తూ, జీవన యుద్ధంలో ఎదురయ్యే సంకటాలను, కష్టాలను అధిగమించడానికి భగవద్గీతలో చెప్పబడిన మార్గదర్శకాలను అనుసరించడం భగవద్గీతను పఠించడం లేదా వినడం ద్వారా జ్ఞానం, ఓర్పు, నేర్పు లభిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. అనంతరం సత్సంగ సభ్యులచే భగవద్గీత పారాయణం జరిగింది. కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, దేవాలయ కమిటి సభ్యుల పాల్గొన్నారు.
.jpeg)





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి