అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
వైభవంగా వరలక్ష్మి వ్రతం - సంపదలివ్వు తల్లీ...
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, పద్మావతి కల్యాణమండపం వేదికగా ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సి.హెచ్ మస్తానయ్య, పాలకమండలి వారి అద్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి మాధవస్వామి బృందం వరలక్ష్మి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు వందల మందికి పైగా సువాసినులచే శుక్రవారం వ్రతాలు కుంకుమార్చనలు, పారాయణలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి