సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
అలరించిన చిన్నారుల నృత్యాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావే దికపై శనివారం శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం నిర్వహిం చారు. ప్రసన్నలక్ష్మీ ఉద్దిశెట్టి అధ్యక్షత వహిం చగా, దక్షిణ డీఎస్పీ భానోదయ, శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ఆలయ పాలక మండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరిం చాయి. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు అందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి