అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
అలరించిన జానపద నృత్యాలు
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో రాధామాధవ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన జానపద నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాట్యాచార్య షేక్ ఖలీల్ నృత్య దర్శకత్వంలో పలువురు చిన్నారులు జానపద నృత్యాంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి