ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 04.12.2026

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.

నేత్రానందం నృత్యాభినయనం - 27.04.2025

నేత్రానందం నృత్యాభినయనం

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న మహామంజీర నాదం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కార్యక్రమాల్ని విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య ప్రారంభించగా, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురవల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సభలో తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ ఎస్.జమునారాణి, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొని తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు అరవీటి ప్రభావతి, విశ్రాంత నృత్య శాఖాధిపతి దేవేంద్ర పిళ్ళై లను మరంగంటి కాంచనమాల జీవిత సాఫల్య పురస్కా రంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు ఎస్ కె బాదుషా మణిపురి నాట్యాన్ని, భువనేశ్వ ర్కు చెందిన గోకుల్ కృష్ణ ఒడిస్సీ నృత్యాన్ని, తిరుపతికి చెందిన డాక్టర్ శరత్ చంద్ర భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నా రు. కార్యక్రమాలను వెంకటగిరి నాగలక్ష్మి, పఠాన్ మొహిద్దిన్ పర్యవేక్షించారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.