ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన తాళం భజన - శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు - 10.10.2026

అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ   పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.

 లక్ష పుస్తకాల సేకర్త!

నవంబర్ 14 నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం కూడా. ఇవి రెండూ కాక గ్రంథాలయ ఈ శుభ సందర్భంలో ఒక గొప్ప వ్యక్తిని గూర్చి పాఠ కులకు చెపుదాం అనుకుంటున్నాను.

తెలుగు రాష్ట్రాలలో పెద్ద వ్యక్తిగత గృహ గ్రంథాలయాలు కలిగివున్న నార్ల వెంకటేశ్వరావు, ఆరుద్ర, కొంగర జగ్గయ్య, ఎ.బి.కె. ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వర రావు, చలసాని, సి.వి.యన్. ధన్ తదితరుల్ని గూర్చి వినే ఉంటారు. వీరిలో నార్ల గ్రంథాలు అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి, ఆరుద్ర పుస్తకాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి, ఎ.బి.కె. పుస్తకాలు సి.ఆర్ ఫౌండేషన్కి ఇచ్చి వేయబడ్డాయి. 5 వేల నుంచి 25 వేల వరకు పుస్తకాలు గల హోం లైబ్రరీలు, అనేకమంది ప్రముఖ సాహితీవేత్తల దగ్గర, పాత్రికేయుల దగ్గరా, వామపక్ష రాజకీయ నాయకుల దగ్గరా ఉండటం కూడా గమనిస్తున్నాం.

కాని ఒక సాదాసీదా ప్రభుత్వోద్యోగి, ఇప్పటిలా జీతాలు లక్షల్లో లేని ఆ రోజుల్లో, ఆ తర్వాత వచ్చే పెన్షన్ తోనూ, లక్ష వరకు పుస్తకాలే గాక అనేక వేల జర్నల్స్, నాలుగు లక్షలకు పైగా పేపర్ కట్టింగ్స్ బైండింగ్లు, ఒకే పుస్తకానికి వచ్చిన వివిధ అనువాదాలు, ఒకే పుస్తకం వివిధ ప్రచురణలు కలిగి ఉండటం.. ఇవన్నీ లారీల్లో వేసుకొని ఐదిలీ అయిన ప్రతి ఊరికీ తిరగటం - ఇవేవీ సాధారణ విషయాలు కావు. ఆ అసాధారణ వ్యక్తి లంకా సూర్యనారాయణ.

1936 ఆగస్ట్ 23న గుంటూరు జిల్లా గొట్టిపాడు గ్రామంలో పుట్టి, సెంట్రల్ ఎక్సయిజ్ శాఖలో పని చేసి, 1992లో పదవీ విరమణ చేసిన ఈ పెద్దాయన మా గుంటూరులో దర్శనీయ స్థలం లేదనే లోటును తీరుస్తూ తన సమస్త పుస్తక సంపదను కంచి కోమకోటి పీఠం ఆధ్వర్యంలో గుంటూరులో వున్న వెంకటే శ్వరస్వామి దేవస్థానానికి (బృందావన్ గార్డెన్స్) ఇచ్చేశారు. వారు అన్నమయ్య గ్రంథాలయం పేరిట మూడు అంతస్తుల మేడలో బీరువాల్లో భద్రపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ఆనాటి నుంచి మా ఊరు వచ్చిన ప్రతి సాహితీవేత్తా, పుస్తక ప్రియుడూ అక్కడికి వెళ్లి ఆ పుస్తకాల్ని. లంకా గారిని చూసి ఆయన ఆతిథ్యాన్ని తీసుకోకుండా వెళ్ళరు. ఈ పుస్తక సంపద ఇచ్చిన సమా చారంతో 30 మంది డాక్టరేట్లు పొందా రంటే అది చిన్న విషయం కాదు. "ఇదంతా ఆ పెద్దాయన బ్లడ్ అండ్ స్వీట్ ఇది ఫలిస్తుంది." అని దీవించిన శ్రీరమణ మాటలు నిజమయ్యాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో డా. కూరెళ్ల విఠలాచార్య కర్ణాటకలోని మాండ్యలో తన సంపాద నాలో 80శాతం డబ్బుని, తనకున్న ఒకే ఒక ఇంటిని అమ్మి, తన పదవీ విరమణ బెనిఫిట్స్ని కూడా వినియోగించి రెండు లక్షల పుస్తకాల్ని సేకరించి ఇంటిలోనే గ్రంథాలయం నడుపుతున్న అంకెగౌడ్ని; తన సమస్త సంపదని (10 మిలియన్ డాలర్లు) వెచ్చించి 4 లక్షల పుస్తకాలు, 3 లక్షల రాతప్రతులు సేకరించిన హస్టింగ్టన్ (కాలిఫోర్నియా) గురించి; తమిళనాట రోజా ముత్తయ్య, బెంగాల్లో లో ఆశుతోష్ ముఖర్జీల గురించి విన్నామే గాని అదే ఒరవడి కలిగిన లంకా సూర్యనారాయణను చూడటం, ఆయనతో సురీ పరిచయ భాగ్యం కలిగి ఉండటం జీవితంలో ఆనందదాయకమైన విషయం. 70-3 దశకాల్లో నలభై సంవత్సరాల వయస్సులో నవోదయ పబ్లిషర్స్లో పుస్తకాలు వెదుక్కుంటూ కనిపించే ఈ మానవుడు ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో ఆదివారం పుట్పాత్లపై సెకండ్

లంకా సూర్యనారాయణ అపురూప సేకరణలో 500 భగవద్గీతలు, 300 భాగవతాలు, 100 మహాభారతాలు, 550 రామాయణాలు, ఐదువేల ఆత్మకథలు, రవీంద్రుని గీతాంజలి' కావ్యానికి ఆదిపూడి సోమనాధరావు తొలి తెలుగు అనువాదం నుంచి డా. భార్గవి ఇటీవలి అనువాదం దాకా మొత్తం 51 తెలుగు అనువాదాలు; 1600 శతకాలు; 700 నిఘంటు వులు... ఇవి ఆయన సేకరణలో కొన్ని. కేవలం పది పైసలు ఇచ్చి ఒక మిఠాయి బండి వాడి దగ్గర మిల్టన్ పూర్తి రచనలు కొన్నారట. గుంటూరు విజయవాడలే కాదు: ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాలు వెళ్లినప్పుడు కూడా ఫుట్పాత్లపై అపురూప గ్రంథాలు సేకరించారు.

ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చూసి పక్కన పెడితే వరస క్రమం తప్పకుండా వారే సర్దుకుంటారు. కోరుకున్న వ్యక్తులకు కోరుకున్న పుస్తకాలు స్కాన్ చేసి, పెన్స్డ్ డ్రైవ్స్ ఇస్తారు. అన్నమయ్య గ్రంథాలయం కేటలాగ్ వికీపీడియా పేజీలో దొరుకుతుంది. ఇంకా ఇతర ప్రాంతాల వారు 0863-2246365 నంబర్లో సంప్రదిస్తే కేటలాగ్ సాఫ్ట్ కాపీని ఈమెయిల్ ద్వారా కూడా అందుకోవచ్చు. అన్నట్లు ఈయన సేకరించిన పుస్తకాల్లో చదివి ఇస్తానని తర్వాత ఇవ్వకుండా ఉన్న పుస్తకం గాని, కొట్టేసిన పుస్తకం గాని ఒక్కటి కూడా లేదని ఆయన మిత్రులు చెబుతారు. అన్ని పుస్తకాల దొంతరల్లో మనకు కావాల్సిన పుస్తకం ఒక్క నిముషంలో తీసి ఇవ్వగలరు.

పుస్తకాలు ఎక్కువగా ఉండే వ్యక్తుల ఇళ్లల్లో పుస్తక పరిజ్ఞానం తక్కువగా ఉన్న ఆడవాళ్ల పోరు చాలామందికి అనుభవమై ఉంటుంది. లంకా గారి మర్యాదల్ని. ఆయన పుస్తకాల గుట్టల్ని, దానికోసం ఆయన పెట్టిన ఖర్చుని అర్థ శతాబ్దానికి పైగా భరించిన వారి శ్రీమతి వరలక్ష్మి గారు, ఇంకా ఆయన చెప్పకుండానే ఆయన ఏమి చెబుతారో ఊహించి ప్రవర్తించే గ్రంథాలయ సంచాలకురాలు సుభాషిణి గారు దొరకటం లంకా సూర్యనారాయణ అదృష్టం. కాగా లంకా సూర్యనారాయణ గుంటూరు వారు కావటం గుంటూరు ప్రజల అదృష్టం.

• చెరుకూరి సత్యనారాయణ




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు - 08.11.2025

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనల సోదాహరణ పూర్వక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాన విద్యాప్రవీణ విద్వాన్ ఆకొండి శ్రీని వాస రాజారావు, తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలకు సోదాహరణ పూర్వక వివరణతో శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్ బాబుల వాయిద్యాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు మాధవపెద్ది మీనాక్షి, ముఖ్య అతిథి పూర్వ ప్రధానాచార్యులు, హిం దూ కళాశాల గుంటూరు, సాహితీ రత్నాకర డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్, ఆత్మీయ అతిథి డాక్టర్ సి. జ్యోతి కాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ తూము లక్ష్మీనరసింహ దాసు వాగ్గేయకారులలోని అనేక విశేషార్థాలను వివరిస్తూ ఇటువంటి కార్యక్రామాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను సత్కరించారు.