భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి