హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి
ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ కే.ఆర్.కే.ఎం. మెమోరియల్ అకాడమీ అఫ్ ఫైన్
ఆర్ట్స్ ఆధ్వర్యంలో 15.09.2024 ఆదివారం అమరావతి నాట్యోత్సవాలలో భాగంగా నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి శిష్య బృందం
పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని, ప్రముఖ నాట్యచారి సత్యనారాయణరాజు రామ కథ లోని ప్రధాన ఘట్టాలను భరతనాట్యాన్ని
ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి