మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.
వైభవంగా గోదా అమ్మవారికి శ్రీ పుష్పయాగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరునక్షత్ర సందర్భంగా సోమవారం అమ్మవారికి శ్రీ పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సూరెడ్డి రాంప్రసాద్, పద్మజ దంపతుల సౌజన్యంతో, పాలకవర్గ సహాయ సహకారాలతో, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు తో విశేష అభిషేకాలు, అర్చనలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరణ జరిగాయి. మల్లె, జాజి, బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ, గులాబి, సంపంగి, తులసి దళాలు తదితర ఏడు క్వింటాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. హరి సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొన్నారు.