అలరించిన అన్నమాచార్య సంకీర్తనలహరి స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధ వారం అన్నమాచార్య సంకీర్తన లహారి నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం జీవిత విశేషాలు, విజయాలను సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వివరించారు. అనంతరం డాక్టర్ జె.కృష్ణకుమారి పర్యవేక్షణలో మోహనగానం వైకుంఠమే సంస్థ సభ్యులు అన్నమాచార్య కీర్తనలు అలపించారు. రుక్మిణి వరప్రసాద్, సునీత, రమణి, ఇందు తమ గాత్రధారణలో అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న వంటి ప్రసిద్ధ కీర్తనలను ఆలపించగా, ప్రేక్షకులను మెప్పించాయి. కీబోర్డుపై సాయి, తబలాపై రమణ వాయిద్యాన్ని అం దించారు. కార్య క్రమంలో మహిళా విభాగం కోశాధికారిణి డాక్టర్ మైలవరపు లలితకుమారి, సభ్యులు పాల్గొన్నారు.
నిషాధ రాజ్యానికి రాజు నలుడు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై ప్రబంధ సాహిత్యం - ఆధ్యాత్మికం ప్రవచనాల్లో భాగంగా మంగళవారం నలోపాఖ్యానంలోని హంస-నలుని వృత్తాంతంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయ బాబు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రసంగిస్తూ నలుడు నిషాధ రాజ్యానికి రాజని అన్నారు. ఆయన దమయంతి అనే విదర్భ యువరాణిని వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఒకరోజు నలుడు తన తోటలో విహరిస్తుండగా, ఆయన ఒక అందమైన హంసను పట్టుకున్నాడని తెలిపారు. ఆ హంస మానవ భాషలో మాట్లాడిందని అన్నారు. నలుని వద్దకు దమయంతి వద్దకు రాయబారంగా వెళ్లి, ఆమెకు నలుని గురించి చెప్పిందన్నారు. ఆ తర్వాత, దమయంతి స్వయంవరంలో నలుడు, దమయంతిని ఎంచుకున్నాడని హంస- నలుని వృ ంత్తాంతాన్ని విపులంగా వివరించారు.