అలరించిన అన్నమాచార్య సంకీర్తనలహరి స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధ వారం అన్నమాచార్య సంకీర్తన లహారి నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం జీవిత విశేషాలు, విజయాలను సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వివరించారు. అనంతరం డాక్టర్ జె.కృష్ణకుమారి పర్యవేక్షణలో మోహనగానం వైకుంఠమే సంస్థ సభ్యులు అన్నమాచార్య కీర్తనలు అలపించారు. రుక్మిణి వరప్రసాద్, సునీత, రమణి, ఇందు తమ గాత్రధారణలో అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న వంటి ప్రసిద్ధ కీర్తనలను ఆలపించగా, ప్రేక్షకులను మెప్పించాయి. కీబోర్డుపై సాయి, తబలాపై రమణ వాయిద్యాన్ని అం దించారు. కార్య క్రమంలో మహిళా విభాగం కోశాధికారిణి డాక్టర్ మైలవరపు లలితకుమారి, సభ్యులు పాల్గొన్నారు.
అలరించిన సంగీత విభావరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం భక్తి సంగీత విభావరి నిర్వహించారు. భక్తిగాన లహరి ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. బోడపాటి శ్రీనివాసరావు బృందంతో పలు భక్తి గీతాలను ఆలపించారు. కీబోర్డుపై సాయి, తబలపై రమణ వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ పాల్గొని బోడపాటి శ్రీనివాసరావునునగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి