వందేమాతరం 150 సంవత్సరాల పండుగ
గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం సీనియర్ సిటిజను వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్యర్యంలో ‘వందేమాతరం’ 150 సం॥రాల పండుగ ఘనంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన మహళావిభాగం అధ్యక్షరాలు డాక్టర్ టి. రాధాబాయి వందేమాతర గీతం స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ముఖ్యాతిధి డాక్టర్ ఎమ్. ఉమాసుందరి ప్రకృతి వైద్యం - మహిళల కర్తవ్యం అనే అంశంపై ప్రసంగించి పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్ధులు సిద్ధిక్, సిద్దిక్ష కవలలు వందేమాతర గీతం, దేశభక్తి గీతాలు ఆలపించారు. సభకు డా॥మైలవరపు లలితకుమారి స్వాగతం పలుకగా, దేవాలయ పాలకమండలి అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య, మహిళావిభాగం కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి. ఇతర సభ్యులు పాల్గొన్నారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి