రైతు జన బాంధవుడు ఆచార్య ఎన్జీరంగా
రైతు జన బాంధవుడు ఆచార్య ఎనీ రంగా అని ప్రముఖ విద్యావేత్త ఆర్.వి.శివ రామయ్య అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా జయంతి వేడుకలు, ఎన్జీ రంగా సాహిత్య పురస్కార ప్రదానం- 2025 శుక్రవారం బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ఆవరణలోని పద్మావతి కల్యాణ వేదికపై నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు అధ్యక్షత వహించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు సభకు ఆహ్వానం పలకగా, ఆంధ్ర సాహిత్యంలో ఆచార్య రంగ అంశంపై డాక్టర్ బీరం సుందరరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా శివరామయ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధునిగా, సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా కొనసాగారని అన్నారు. ఎనీ రంగా సాహిత్య పురస్కార ప్రదానం- 2025 ప్రథమ బహుమతి రూ.10 వేల పురస్కారాన్ని రచయిత్రి సి.యమున(హైదరాబాద్)కు, ద్వితీయ బహుమతిని రచయిత్రి పెబ్బలి హైమావతి (విశాఖప ట్నం)కి రూ.5 వేలు అందించారు. పురస్కార పరి చయాన్ని డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, బహుమతి గ్రంథ పరిచయాన్ని డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ చేశారు. సభలో భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారా యణ, దేవస్థానం ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, డాక్టర్ వెనిశెట్టి సింగారావు, వెలగా పుష్పకుమారి, జక్కంపూడి వెంకటసుబ్బయ్య, న్యాయనిర్ణీతలు లక్ష్మీ ప్రసన్న, సింహాద్రి జ్యోతిర్మయి పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి