వైభవంగా సత్యనారాయణస్వామి వ్రతం, దీపోత్సవం, జ్వాలతోరణం
స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థాన ఆవరణలో సామూహిక సత్య నారాయణస్వామి వ్రతాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి బృందం భక్తి శ్రద్దలతో చేపట్టారు. సాయంత్రం ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహాకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, వెంకటేశ్వర్వసామి దేవాలయ కమిటీ సభ్యులు, శ్రీశైలం దేవస్థానం పాలకవర్గ సభ్యులు బోడేపూడి సుబ్బారావు, సీనియర్ వైద్యులు కొండబోలు బసవపున్నయ్య హాజరై జ్వాలాతోరణం విశేషంగా నిర్వహించారు. మృత్యుంజయ లింగానికి అభిషేకాలు, కార్తీక దీపాలను వెలిగించి హరినామస్మరణ చేశారు. ఆనంతరం దీపోత్సవం కనుల పండుగగా చేపట్టారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి